ప్రశాంతంగా గురుకుల ప్రవేశ పరీక్ష
గురుకులా ల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష-2026 ప్రశాంతంగా జరిగినట్లు సాంఘి క సంక్షేమ గురుకులాల కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు.
ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 22: గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన తెలంగాణ గురుకుల ప్రవేశ పరీక్ష-2026 ప్రశాంతంగా జరిగినట్లు సాంఘి క సంక్షేమ గురుకులాల కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సమన్వయ అధికారి శారద తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల నుం చి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 23 సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 5847 మంది విద్యార్థులకు గాను 5645 మంది హాజరయ్యారని, 202 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
సిర్పూర్(టీ), ఫిబ్రవరి 22 : సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో నిర్వహించిన గురుకులాల ప్రవేశ పరీ క్ష ప్రశాంతంగా జరిగింది. గురుకుల బాలికల పాఠశాలలో మొత్తం 360 మంది విద్యార్థుల కు గాను 354 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రిన్సిపాల్ శారద తెలిపారు. జడ్పీ పాఠశాలలో మొత్తం 292 మంది విద్యార్థులకు 283 మం ది హాజరైనట్లు జడ్పీ పాఠశాల సీఎస్ వెంకటరమణ పేర్కొన్నారు. పరీక్ష నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆదేశాల మేరకు ప్రవేశ పరీక్ష కేంద్రా ల ముందు విద్యార్థులు, తల్లిదండ్రులకు బీఆర్ఎస్ నాయకులు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొంగ సత్యనారాయణ, అస్లాంబిన్ అబ్దుల్లా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బెల్లంపల్లి మండలంలో..
బెల్లంపల్లి, ఫిబ్రవరి 22 : పట్టణంలోని కాసిసేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం టీజీసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఆరో తరగతి విద్యార్థులను 388 మంది విద్యార్థులకు గాను 376 మంది హాజరయ్యారు. డిపార్ట్మెంటల్ అధికారిగా వినోద్‌కుమార్ పర్యవేక్షించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

