IPL 2025 | సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్‌కు రూ.24లక్షల జరిమానా విధించారు. సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు సైతం స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించారు. ఈ సీజన్లో ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి.. తొలిసారిగా స్లో ఓవర్‌రేట్ రావడంతో కేవలం రూ.12లక్షల జరిమానా విధించారు. నిర్ణీత ఓవర్ల కోటాను సమయంలోగా వేయకపోవడంతో ఇది రెండోసారి. దాంతో రజన్ పాటిదార్‌కు ఐపీఎల్ పరిపాలన రూ.24లక్షల జరిమానా విధించింది.
ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా మిగిలిన ప్లేయింగ్ పదకొండు మంది సభ్యులకు వ్యక్తిగతంగా రూ.6 లక్షలు.. లేదంటే మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానాగా విధించనున్నట్లు తెలిపింది. షాకింగ్ విజయం ఏంటంటే.. ఆర్సీబీ జట్టు ముందుగా బౌలింగ్ చేసింది. ఈ మ్యాచ్‌లో రజత్ కాకుండా.. జితేశ్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రజత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చాడు. అయినా ఈ మ్యాచ్‌లో రూ.24లక్షల జరిమానా విధించారు. రెగ్యులర్ కెప్టెన్ పాటిదార్ కావడంతో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్‌కు రూ.12లక్షల జరిమానా విధించారు. సన్‌రైజర్స్ ఇప్పటికే ఐపీఎల్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ప్లేఆఫ్‌లోకి దూసుకెళ్లింది. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను సన్‌రైజర్స్ ఈ నెల 27న లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆడనున్నది.
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసిన ఎస్ఆర్హెచ్.. ఆ తర్వాత 19.5 ఓవర్లలోనే 189 పరుగులకు ఆర్సీబీని ఆల్ అవుట్ చేసింది. సన్‌రైజర్స్‌పై ఓటమితో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తొలి రెండుస్థానాలకు చేరుకోవడం కష్టంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 48 బంతుల్లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతనికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచులో ఇషాన్ ఏడు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు.