BCCI : భారత క్రికెట్ నియంత్రణ మండలి అథ్లెట్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. బెంగళూరులో క్రికెటర్ల కోసం కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) లో అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశమిస్తామని చెప్పింది. బెంగళూరులో భారత క్రికెటర్ల కోసం కొత్తగా నిర్మించిన త్వరలోనే ప్రారంభం కానుంది. ఆధునిక వసతులతో రూపొందించిన ఈ అకాడమీలో యువక్రికెటర్ల పాలిట వరంగా మారనుంది. అంతర్జాతీయ హంగులతో కూడిన ఈ అకాడమీ గురించి గురువారం బీసీసీఐ సెక్రటరీ జై షా (Jai Shah) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఎన్సీఏ అనేది క్రికెటర్ల కోసమే కాదని, అథ్లెట్లకు కూడా ఉపయోగపడనుందని చెప్పాడు. ‘ఎన్సీఏను క్రికెటర్లకే కాకుండా ఒలింపిక్ సూపర్ స్టార్ నీరజ్ చోప్రా(Neeraj Chopra)కు కూడా అందుబాటులో ఉంచుతాం. ఒలింపిక్స్ సన్నద్ధతలో ఉన్న ఇతర అథ్లెట్లు కూడా క్రికెట్ అకాడమీని ఉపయోగించుకోవచ్చు’ అని షా తెలిపాడు.
నీరజ్ చోప్రా
ఈ మధ్యే షా కొత్తగా కట్టిన ఎన్సీఏలోని వసతుల గురించి ఓ పోస్ట్ పెట్టాడు. ‘కొత్త జాతీయ క్రికెట్ అకాడమీ ఏర్పాటు ప్రక్రియ ముగింపు దశకు వచ్చిందనే విషయాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే బెంగళూరులో ఈ అకాడమీని ప్రారంభించనున్నాం.
Very excited to announce that the @BCCI’s new National Cricket Academy (NCA) is almost complete and will be opening shortly in Bengaluru. The new NCA will feature three world-class playing grounds, 45 practice pitches, indoor cricket pitches, Olympic-size swimming pool and… pic.twitter.com/rHQPHxF6Y4
— Jay Shah (@JayShah) August 3, 2024
ఈ కొత్త ఎన్సీఏలో మూడు ప్రపంచ స్థాయి మైదానాలు, 45 ప్రాక్టిస్ పిచ్‌లు, ఇండోర్ క్రికెట్ పిచ్‌లు, ఒలింపిక్ పోటీల్లో ఉపయోగించేంతటి పెద్ద పరిమాణంలోని ఈత కొలను ఉన్నాయి. ఇవే కాకుండా ఆర్ట్ ట్రైనింగ్, ఆటగాళ్ల చికిత్స, స్పోర్ట్స్ సైన్స్‌కు సంబంధించిన సకల వసతులు ఉన్నాయి. భారత క్రికెటర్లు, భావి ఆటగాళ్లు ఒక సకల సౌకర్యాలతో కూడిన వాతావరణంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు మా ఈ ప్రయత్నం ఉపకరిస్తుందని మేము భావిస్తున్నా’ అని షా వెల్లడించాడు.