వెంకటాపురం(నూగూరు), ఫిబ్రవరి 20 : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ములుగు జిల్లా పామునూరు గ్రామ సమీపంలోని కర్రెగుట్టల్లో శుక్రవారం ఐఈడీ బాంబు పేలి సీఆర్పీఎఫ్ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం.. పామునూరు-జల్లా గ్రామాల సమీపంలోని కర్రెగుట్టల్లో 39వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్రవారం ఉదయం సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించాయి.
పామునూరు నుంచి జల్లా గ్రామానికి రోడ్డు వేస్తున్న క్రమంలో కల్వర్టులను పరిశీలిస్తుండగా 11 ఐఈడీ బాంబుల ను గుర్తించి నిర్వీర్యం చేసినట్టు సమాచారం. 12వ బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో ప్రమాదవశాత్తు పేలి నవజీత్ అనే జవాన్ కాలికి తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. చికిత్స కోసం నవజీత్‌ను హెలిక్యాప్టర్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లినట్టు సమాచారం.