Hyderabad Rains | హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండతో ఉక్కపోత ఉండగా.. సాయంత్రానికి ఒక్కసారిగా చల్లబడింది. ఆ తర్వాత మేఘాలు కమ్మేయడంతో వాన దంచికొడుతున్నది. శేరిలింగంపల్లి, మియాపూర్, పటాన్చెరు, కూకట్పల్లి, అమీర్పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, ఆల్వాల్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.
భారీ వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.