Gut Health : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేవుల ఆరోగ్యం అత్యంత కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ నుంచి జీవక్రియల వరకూ, మెరుగైన ఇమ్యూనిటీకి ప్రేవుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటం అవసరం. ప్రేవుల ఆరోగ్యం దెబ్బతింటే అది పలు వ్యాధులకు దారితీస్తుంది. ప్రేవుల ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది, దాన్ని మెరుగుపరుచుకోవడం ఎలా అనే టిప్స్‌ను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో వివరించారు.
మన అలవాట్లతో పాటు పలు కారణాల వల్ల ప్రేవుల ఆరోగ్యం ప్రభావితమవుతుందని ఆమె చెప్పుకొచ్చారు. స్వీట్లు, గోధుమతో తయారైన పిజ్జాలు, పాస్తాలు, వైట్ బ్రెడ్, బ్రేక్‌ఫాస్ట్ సిరిల్స్, కేకులు, ఐస్‌క్రీంలు, డెజర్ట్స్ వంటి ప్రాసెస్డ్ ఆహారాలతో ప్రేవుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇక ప్రేవుల్లో ఇన్ఫెక్షన్లు, పొట్టలో ఆమ్లాలు పేరుకుపోవడం, టాక్సిన్స్ చేరడం, యాంటీబయాటిక్స్ అతిగా వాడటం, ఒత్తిడి వంటి కారణాలతో ప్రేవుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
మరి ప్రేవుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలనే వివరాలనూ ఈ పోస్ట్‌లో అంజలి ముఖర్జీ వివరించారు. ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలు, ప్రొబయాటిక్‌తో కూడిన ఆహారాలను తీసుకోవడం ద్వారా ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కూరగాయలు, పప్పు ధాన్యాలు, పండ్లు అధికంగా తీసుకోవాలని ఆమె సూచిస్తున్నారు.
Read More :