Monsoon Infections : వర్షాకాలంలో దోమల వ్యాప్తితో పాటు వివిధ కారణాలతో పలు రకాల ఇన్ఫెక్షన్లు, వైరస్ల ముప్పు పొంచి ఉంటుంది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ఎన్నో వ్యాధులు ప్రబలుతుంటాయి. వర్షాకాలంలో అనారోగ్యాల బారినుంచి తప్పించుకునేందుకు వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు పాటించడం ద్వారా చాలావరకూ వ్యాధులను నివారించవచ్చు.
ముందస్తు జాగ్రత్త చర్యల ద్వారా ఇన్ఫెక్షన్ల బారినపడకుండా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా వివిధ అనారోగ్యాల ముప్పును నివారించవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా వర్షాకాలంలో ఇమ్యూనిటీ బలహీనపడుతుంటుంది. దీంతో వైరస్లు, ఇన్ఫెక్షన్ల బారినపడే ముప్పు అధికంగా ఉంటుంది.
అందుకే ఈ సీజన్లో సిట్రస్ పండ్లు, అల్లం, వెల్లుల్లి, పసుపు, తాజా ఆకుకూరలు, కూరగాయల వంటి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఆహారాలను అధికంగా తీసుకోవడం మేలు చేస్తుంది. ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్లు, వైరస్ల బారి నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇక వర్షాకాలంలో ఈ సూచనలు పాటించడం మేలు..
ఇమ్యూనిటీ బలోపేతం
వ్యక్తిగత పరిశుభ్రత
సురక్షిత మంచినీరు
స్ట్రీట్ ఫుడ్‌కు దూరం
మస్కిటో రిపెల్లెంట్స్ వాడకం
పరిసరాల పరిశుభ్రత
Read More :
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం