Tirumala Temple | టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేశ్ బాబు కుటుంబ సభ్యులు ( Mahesh Babu Family) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో మహేశ్ సతీమణి నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar), కుమారుడు గౌతమ్, కుమార్తె సితార శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు మేఘా ఇంజినీరింగ్ కంపెనీల అధినేత కృష్ణారెడ్డి సతీమణి మేఘా సుధారెడ్డి కూడా స్వామివారిని దర్శించుకున్నారు.
తిరుమల శ్రీవారి సేవలో మహేష్ బాబు ఫ్యామిలీ@urstrulyMahesh #NamrataShirodkar pic.twitter.com/i9dhbaONbG
— MBYSJTrends ™ (@MBYSJTrends) August 15, 2024
బుధవారం రాత్రి మహేశ్ బాబు సతీమణి నమ్రత తన పిల్లలతో కలిసి అలిపిరి మార్గం నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. తిరుమల చేరుకున్న అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రికి అక్కడే బస చేసి ఇవాళ ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
అలిపిరి కాలినడక మార్గంలో తిరుమల చేరుకున్న టాలీవుడ్ లెజెండ్ సూపర్ స్టార్ ఎంపరర్ #MaheshBabu𓃵 కుటుంబ సభ్యులు 🙏 విజయోస్తు, శుభమస్తు#NamrataShirodkar #GauthamGhattamaneni #SitaraGhattamaneni pic.twitter.com/dsGv2EtqRq
— 🇲🇦🇽 ᴰʰᶠᵐ 🦋 (@urstrulyMaxDHFM) August 14, 2024
Also Read..
కెరీర్లోనే బెస్ట్రోల్ చేశాను