అచ్చ తెలుగు అందం శ్రీలీల అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో అగ్ర నాయికగా ఎదిగింది. అయితే ఈ అమ్మడు నటించిన చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపోవడంతో రేసులో కాస్త వెనకబడింది. అయినా ఈ భామకు మంచి అవకాశాలే వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం శ్రీలీల బాలీవుడ్ అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలిసింది.
సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటించబోతున్న ‘మిట్టి’లో ఆమె కథానాయికగా ఎంపికైందని వార్తలొస్తున్నాయి. బల్వీందర్‌సింగ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల్లో ఉంది. అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
ఈ సినిమా కోసం శ్రీలీలతో సంప్రదింపులు పూర్తయ్యాయని, కథలోని కొత్తదనం నచ్చడంతో ఆమె అంగీకారం తెలిపిందని సమాచారం. శ్రీలీల ప్రస్తుతం తెలుగులో నితిన్‌తో ‘రాబిన్‌హుడ్’ చిత్రంలో నటిస్తున్నది. రవితేజ 75వ చిత్రంలో కూడా ఆమే కథానాయిక.