Mr. Bachchan | మాస్ హీరో రవితేజ కథానాయకుడిగా, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. భాగ్యశ్రీ బోర్సే నాయికగా నటించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలోని పాటలు, హీరోయిన్ అందాలు, హరీష్‌శంకర్ అగ్రెసివ్ ప్రమోషన్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే విడుదలకు ఒకరోజు ముందే ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ మొదలయ్యాయి.
ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదలైన మిస్టర్ బచ్చన్ ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో తెలుసుకుందాం. హిందీలో అజయ్ దేవగన్ నటించిన రైడ్ చిత్రానికి రీమేక్‌గా మిస్టర్ బచ్చన్‌ను విడుదల రెడీ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్. అయతే తనదైన శైలిలో రైడ్ కథలో భారీ మార్పులు చేసి విఫలమయ్యాడు దర్శకుడు. నవ్వురాని మాస్ కామెడీతో.. హీరోయిన్ రొమాన్స్, అందాలతో రొమాంటిక్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలన్న ఆయన ప్రయత్నం బెడిసికొట్టింది.
ఫస్ట్ హాఫ్‌లో ఏమీ తీశాడు.. అనిపించేలోపు ఇంటర్వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్‌లో ప్రేక్షకులకు ఓపికకే పరీక్షే అని చెప్పాలి.. దిబెస్ట్ రొటిన్ సన్నివేశాలతో.. విసుగు తెప్పించే కామెడీతో.. లాజిక్.. మ్యాజిక్ ఏమీ లేకుండా చిత్రాన్ని రూపొందించడంపైనే కాన్స్రటేషన్ పెట్టాడు దర్శకుడు. ముఖ్యంగా ఇన్‌కమ్‌ట్యాక్స్ డిపార్ట్మెంట్ను, ఆ ఆఫీసర్లను హరీశ్ శంకర్ ప్రజెంట్ చేసిన విధానం చూస్తే పూర్తి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ భాగ్యశ్రీని కేవల అందాల ప్రదర్శనకే పరిమితం చేశాడు. ఈ సినిమాలో వున్న సిద్దు జొన్నలగడ్డ ఎంట్రీ అతని కామియో కాస్త రిలీఫ్ నిస్తుంది. ఫైనల్‌గా మిస్టర్ బచ్చన్‌ను రొటిన్ ఎంటర్టైనర్గా.. రెగ్యులర్ ఎంటర్టైనర్గా అనిపిస్తుంది.. తప్ప ఎక్కడా కూడా ఈ సినిమాను చూడాలనే ఉత్సాహం అనిపించే ఒక్క సన్నివేశం కూడా కనిపించదు. ఫైనల్‌గా ఇది హరీశ్ శంకర్ అవుట్‌డేటెడ్ రైడ్ అన్ మాస్ సినిమా.