హైదరాబాద్, సిటీబ్యూరో, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : ప్రతీ గురువారం సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ 26న నిర్వహించడం లేదని అధికారులు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. అంతర్గత పరిపాలన కారణాలతో గ్రీవెన్స్ రద్దు చేసినట్టు వివరించారు.
టూరిజం ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు చాడ
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టూరిజంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వ యో పరిమితిని 61 ఏండ్లకు పెంచాలని సీపీఐ సీనియర్ నాయకుడు, టూ రిజం ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు చాడ వెంకట్రెడ్డి కోరారు.
శుక్రవారం టూరిజం కార్పొరేషన్ మేనేజిం గ్ డైరెక్టర్ వల్లూరు క్రాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి మాట్లాడుతూ.. సమానపనికి సమాన వేతనం ఇవ్వడం తెలంగాణ టూరిజం కార్పొరేషన్ యూనియన్ పోరాట ఫలితమే అని అన్నారు.