Home
Telangana
Three Sarpanches Join Brs Induction Into The Party Takes Place In The Presence Of Ktr
బీఆర్ఎస్లోకి ముగ్గురు సర్పంచ్‌లు.. కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరిక
హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు.
- హుజూరాబాద్‌లో బీజేపీకి షాక్
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో సిరిసేడు, వంతడుపుల, టేకుర్తి సర్పంచ్‌లు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. సిరిసేడు సర్పంచ్ కుమార్ – శ్యామల, వంతడుపుల సర్పంచ్ రాజేశ్- మాధవి, టేకుర్తి సర్పంచ్ శ్రీనివాస్ తదితరులను కేటీఆర్ సాదరంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
సర్పంచ్‌లు మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజల మనసుల్లో చెకుచెదరలేదని స్పష్టంచేశారు. బీజేపీ ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలతో విసిగిన గ్రామస్థాయి నాయకులు, ప్రజలు తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని తెలిపారు. హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని, ఆయన నాయకత్వంపై పూర్తివిశ్వాసం ఉన్నదని పేరొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ వెంకటేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- BRS
- KTR
- sarpanches
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

