హైదరాబాద్ : నగరంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి ( ACB ) పట్టుబడ్డారు. సెక్రటేరియట్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆనందేసి రాఘవేందర్ ( Raghavendar ) , పరిశ్రమ భవన్లో సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ ( Medi Vinod ) రూ.లక్ష లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యండెడ్‌గా చిక్కారు.
సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2 లక్షల మెడికల్ రీయింబర్స్మెంట్స్ చెక్ కోసం సదరు ఉద్యోగులను సంప్రదించగా అందుకు ఇద్దరు లంచం డిమాండ్ చేశారు. మొదటి విడతగా రాఘవేందర్ రూ.5 వేలు తీసుకోగా మలి విడతగా సీనియర్ అసిస్టెంట్ మేడి వినోద్ రూ.లక్షా తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇద్దరిపై కేసు నమోదు చేసి నాంపల్లి జుడిషియల్ కోర్టులో హాజరుపరిచామని ఏసీబీ అధికారులు వివరించారు.