కాకామిఘర: డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియా .. ఏషియన్ గేమ్స్(Asian Games) పురుషుల హాకీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ జరిగిన సెమీఫైనల్లో ఇండియా 4-3 గోల్స్ తేడాతో ప్రత్యర్థి పాకిస్థాన్‌పై విజయం సాధించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 5, 13వ నిమిషాల్లో వచ్చిన రెండు పెనాల్టీ కార్నర్లను అద్భుతంగా గోల్స్‌గా మలిచాడు. ఇక ఆట 23వ నిమిషంలో సుఖ్జీత్ సింగ్ ఓ గోల్ చేశాడు. ఆట చివరి నిమిషాల్లో అభిషేక్ ఫీల్డ్ విన్నింగ్ గోల్ చేసి భారత బృందంలో ఆశలు రేపాడు. పాకిస్థాన్ జట్టు తరపున అబూ మహమూద్ 30వ నిమిషంలో, హనన్ షాహిద్ 45వ నిమిషంలో వాహిద్ రాణా 49వ నిమిషంలో గోల్స్ చేశారు.
సెమీస్ మ్యాచ్‌లో ఆరంభం నుంచి ఇండియా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్లు ప్రారంభంలోనే గోల్స్ చేయడంతో పాక్ టెన్షన్లో పడింది. కానీ సెకండ్ ఆఫ్‌లో అనూహ్య రీతిలో పాకిస్థాన్ పుంజుకుని .. ఇండియాను కొంత ఆందోళనకు గురి చేసింది. అయితే చివరి నిమిషాల్లో అభిషేక్ ఇండియాను ఓటమి నుంచి తప్పించాడు. సెకండ్ హాఫ్‌లో పాక్ ఫార్వర్డ్ ఆటగాళ్లు దూకుడు గేమ్‌ను ప్రదర్శించారు.ఆట 5వ నిమిషంలోనే హర్మన్‌ప్రీత్ తన పవర్ఫుల్ డ్రాగ్ ఫ్లిక్‌తో గోల్ చేశాడు. ఇండియాకు ఫస్ట్ లీడ్ ఇచ్చాడు. ఆ తర్వాత 13వ నిమిషంలో మరో గోల్ చేసి ఇండియాను ఆధిక్యంలో నిలిపాడు.
ఇండియా అటాకింగ్ గేమ్ ఆడడంతో.. ఫస్ట్ క్వార్టర్లో పాకిస్థాన్ ఆ ధాటిని తట్టుకోలేకపోయింది. 23వ నిమిషంలో సుఖ్జీత్ గోల్ కొట్టడంతో ఇండియాకు 3-0 లీడ్ వచ్చింది. కానీ హాఫ్ టైంకు 35 సెకండ్ల ముందు పాకిస్థాన్‌కు పెనాల్టీ కార్నర్‌తో గోల్ వచ్చింది. రెండో హాఫ్‌లో 3-1 తేడాతో వెనుకబడ్డ పాకిస్థాన్.. దూకుడు గేమ్ ఆడింది. 49వ నిమిషంలో హనన్ ఈక్వలైజర్ గోల్ చేసి 3-3తో ఆటపై ఆసక్తిని పెంచాడు. ఇక షూటౌట్ తప్పదు అనుకున్న సమయంలో.. ఆట ముగియడానికి 45 సెకండ్ల ముందు అభిషేక్ గోల్ చేసి పాకిస్థాన్‌ను స్టన్ చేశాడు. దక్షిణ కొరియా, మలేషియా మధ్య జరిగిన మ్యాచ్‌లో గెలిచిన జట్టుతో ఇండియా ఫైనల్లో గోల్డ్ మెడల్ కోసం పోటీపడనున్నది.
𝗪𝗛𝗔𝗧 𝗔 𝗪𝗔𝗬 𝗧𝗢 𝗠𝗔𝗞𝗘 𝗧𝗛𝗘 𝗙𝗜𝗡𝗔𝗟! 🇮🇳🔥
India beat Pakistan 4-3, thanks to a last-minute goal in a nail-biting Asian Games 2026 semi-final, to book a place in the final and keep their title defence alive! 🏑⚡
The Indian Men’s Team now stand just one win away… pic.twitter.com/J8vmZzR8K1
— Hockey India (@TheHockeyIndia) October 1, 2026