KTR | రేవంత్ రెడ్డికి ఒక గొప్ప చరిత్ర ఉంది.. ఆయన ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ మటాష్ అయితదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోస్యం చెప్పారు. ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తెలంగాణలో తెలుగుదేశంను బొందపెట్టి పోయిండు.. తెలంగాణలో తెలుగు దేశంను మొత్తం ఆ పార్టీనే లేకుండా చేసి అడుగు నాశనం చేసి పోయిండు. అక్కడికెళ్లి ఇయ్యాళ్ల కాంగ్రెస్‌లకు వచ్చిండు. దీన్ని కూడా కచ్చితంగా మళ్లీ ఒక 25-30 ఏండ్లు ఎవడూ ఓటేయకుండా చేసే పోతడు. కాంగ్రెస్ మరిపించి.. మొత్తం నాశనం చేసే పోతడన్నారు కేటీఆర్ .
నేతన్నకు బీమా అనే పథకం పెట్టినం. ఎవరన్నా నేత కార్మికుడు చనిపోతే రూ.6 లక్షలు రైతు బీమాలాగే పెట్టినం. మేమంతా కలిసి చేసినం. దాని గురించి ఏమైనా చెప్తడేమో చూసినం. ఆగిపోయింది మళ్లీ షురూ చేస్తా అని చెప్తడేమో అనుకున్నం.. దాని గురించి మాట లేదని కేటీఆర్ అన్నారు. బతుకమ్మ చీరలు బంద్ అయినయ్. అవి మళ్లీ అక్కడ పెడ్తడేమో చెప్తడేమో అనుకున్నం. దాని గురించి ముచ్చట లేదు. అక్కడ నీళ్లిచ్చే పథకం బంద్ అయింది.. దాని గురించి ఏమైనా చెప్తడేమో అనుకున్నం. ఏం లేదు.. మళ్లీ గదే పుక్కిటి పురాణం. ఇక్కడ చేసిన కథలే అక్కడ కూడా చేయడం. ఈ పాటి అందానికి అక్కడికి పోయి మీటింగ్ పెట్టాల్నా అని చురకలంటించారు. అదేదో ఇక్కడనే మైక్ ముందు ఒర్లితే అయిపోతుండేనన్నారు.
రేవంత్ రెడ్డి అక్కడికిపోయి ఏదో దండయాత్రకు పోయినట్టు.. ఒక ముఖ్యమంత్రి, ఒక పీసీసీ ప్రెసిడెంట్, ఆరుగురు మంత్రులు, 30 మంది ఎమ్మెల్యేలు.. ఏదో శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు పోయారు.. మళ్లీ పేరేమో నల్లమల పులి.. ఎక్కడన్నా నల్లమల పులి 4000 పోలీసులను పెట్టుకోని పోతడా.. అంతమందిని కాపాలా పెట్టుకోని పోయిటోడివి.. నువ్వు పులివా.. నువ్వు నల్లమల పులివి కాదు.. చంద్రబాబు దగ్గర పిల్లి నువ్వు.. అని చురకలంటించారు.
రేవంత్ రెడ్డి ఏ పార్టీలో కాలు పెడితే ఆ పార్టీ మాటాష్ అవుతుంది
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బొంద పెట్టాడు
అక్కడి నుండి కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు దాన్ని కూడా నాశనం చేసి ఎవడు ఓటు వేయకుండా చేసి పోతాడు
– కేటీఆర్ https://t.co/1ydllxr4bq pic.twitter.com/FrmOs4RHx4
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
రేవంత్ రెడ్డి నల్లమల పులి కాదు చంద్రబాబు దగ్గరి పిల్లి
4000 మంది పోలీసులను పట్టుకొని సిరిసిల్లకు పోయావు నువ్వు పులివా రేవంత్ రెడ్డి?
3 సంవత్సరాలు అయింది సీఎం అయి.. ఇంకా నీ ఫ్రస్టేషన్ ఏందిరా భాయ్?
నేతన్నలు చనిపోతే రూ.6 లక్షల బీమా వచ్చేలా మా హయాంలో నేతన్నకు బీమా అనే పథకం… https://t.co/PT38lXEasU pic.twitter.com/l2nWNsyBRl
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైలర్ రిలీజ్
Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి