International Yoga Day : అంతర్జాతీయ యోగా దినోత్సవం సంబురంగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల ప్రముఖులు, పౌరులు యోగాసనాలు వేస్తూ సందడి చేశారు. జమ్ముకశ్మీర్ నుంచి టోక్యో, న్యూయార్క్ సిటీ వరకూ ఎక్కడ చూసినా యోగముద్రలో ఉన్న జనంతో కోలాహల వాతావరణం కనిపించింది. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొనగా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) డెహ్రాడూన్‌లో యోగా డేలో ఆసనాలు వేశారు.
జపాన్ ప్రధాని భార్య యొషికొ ఇషిబా (Yoshiko Ishiba) టోక్యోలో వేలాది మందితో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో బాలీవుడ్ వెటరన్ అనుపమ్ ఖేర్(Anupam Kher) ఉత్సాహంగా యోగాసనాలు వేస్తూ కనిపించారు.
ధ్యానముద్రలో రాష్ట్రపతి ముర్ము
సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే భారత సైనికులు సైతం యోగా డేలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సరిహద్దు భద్రతా దళానికి చెందిన సోల్జర్స్ (BSF) అమృత్‌సర్‌లోని అట్టారీ సరిహద్దు వద్ద పలు యోగాసనాలు వేస్తూ.. కాసేపు ధ్యానముద్రలో ఉండిపోయారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్, రక్షణ శాఖ మంత్రివర్యులు రాజ్‌నాథ్ సింగ్‌లు కూడా యోగ చేస్తూ ప్రశాంతంగా గడిపారు.
శనివారం ఉదయం విశాఖ సాగర తీరంలో ‘ఒకే భూమి.. ఒకే ఆరోగ్యం కోసం యోగా’ అనే థీమ్‌తో జరిగిన యోగాంధ్ర వేడుకలో పాల్గొన్న ప్రధాని.. ప్రపంచానికి శాంతి సందేశం వినిపించారు. ‘ఈ రోజుల్లో యోగా అనేది ప్రతిఒక్కరికి అవసరం. వయసు, దేశం విదేశం వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి పౌరుడు యోగా చేయాలి. దాంతో, మనలోని ప్రశాంతత.. అంతర్జాతీయ విధానంగా మారే అవకాశముంది’ అని మోడీ తెలిపారు.
Yoga isn’t just an exercise. It is a way of life. Wonderful to join this year’s Yoga Day celebrations in Visakhapatnam. https://t.co/ReTJ0Ju2sN
— Narendra Modi (@narendramodi) June 21, 2025