Yashasvi – Pant : ఇంగ్లండ్ పర్యటనలో రెచ్చిపోయి ఆడుతున్న భారత యువ క్రికెటర్లు రికార్డులు బద్ధలు కొడుతున్నారు. హెడింగ్లే టెస్టులో శతకంతో విజృంభించిన యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) తన బ్యాట్ పవర్ చూపిస్తూ మరోసారి ఇంగ్లండ్‌పై తన ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆ జట్టుపై విశాఖ టెస్టులోడబుల్ సెంచరీ బాదిన అతడు.. ఈసారి వాళ్ల గడ్డపైనే వంద కొట్టి లెజెండ్ సర్ డాన్ బ్రాడ్‌మన్ (Bradman) రికార్డును బ్రేక్ చేశాడు.
ఇదే మ్యాచ్లోఅర్ధశతకంతో చెలరేగిన వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant).. దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని వెనక్కి నెట్టేశాడు. తొలి రోజు నాటౌట్‌గా నిలిచిన అతడు సేనా దేశాల(దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా)పై అత్యధిక సగటుతో మహీ రికార్డు బద్దులు కొట్టాడు.
ధోనీ, పంత్
సీనియర్ల వీడ్కోలుతో నవశకం మొదలైన ఇంగ్లండ్ పర్యటనలో యశస్వీ జైస్వాల్ తన ఫుట్‌వర్క్, టెక్నిక్‌తో క్రీజులో పాతుకుపోయాడు. తొలి ఇన్నింగ్స్‌ల్లో 101 రన్స్ బాదిన ఈ యంగ్‌స్టర్ స్టోక్స్ సేనపై10 ఇన్నింగ్స్‌లో 813 పరుగులు సాధించాడు. ప్రస్తుతానికి అతడి సగటు 90.33 గా ఉంది. తద్వారా అత్యధిక సగటుతో ఆసీస్ దిగ్గజాన్ని దాటేశాడు యశస్వీ. 63 ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లండ్‌పై 5,028 రన్స్ చేసిన బ్రాడ్‌మన్ సగటు 89.78 మాత్రమే. దాంతో, ఇంగ్లండ్‌పై అత్యుత్తమ సగటు కలిగిన బ్యాటర్‌గా యశస్వీ సరికొత్త రికార్డు లిఖించాడు.
గిల్(127 నాటౌట్), యశస్వీ(101)
లంచ్ తర్వాత యశస్వీ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ తనమార్క్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(127 నాటౌట్) సెంచరీ కొట్టాక రెచ్చిపోయిన పంత్.. వోక్స్, టంగ్ ఓవర్లలో బౌండరీలతో విజృంభించాడు. ఆట ముగిసే సరికి 65 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన ఈ డాషింగ్ బ్యాటర్ సేనా దేశాలపై 38.80 సగటు నమోదు చేశాడు.
💯 on Test debut in WI ✅
💯 in his first Test in AUS ✅
💯 in his first Test in ENG ✅Yashasvi Jaiswal, a truly special talent 🤩 pic.twitter.com/rLymlfFC5h
— ESPNcricinfo (@ESPNcricinfo) June 20, 2025
విదేశీ పిచ్‌లపై చెలరేగిపోయే పంత్.. ఈ దేశాలపై 27 మ్యాచుల్లో నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ శతకాలు సాధించాడు. హెడింగ్లేలో గిల్, యశస్వీ సెంచరీలు.. పంత్ ఫిఫ్టీతో తొలిరోజే 359 పరుగులు చేసింది టీమిండియా. ఈమైదానంలో 2002లో చివరిసారి గెలుపొందిన భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. రెండోరోజు కూడా గిల్, పంత్, నాయర్ దంచేస్తే మ్యాచ్‌పై పట్టుబిగించడం ఖాయం.