టెహ్రాన్: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య భీకర వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. రెండు దేశాల్లో మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అయితే దాడులు ఆగేంత వరకు అణు చర్చలు(Nuclear Talks) ఉండబోమని ఇరాన్ స్పష్టం చేసింది. అటాక్ సమయంలో తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై చర్చించలేమని ఇరాన్ వెల్లడించింది. ఇరాన్‌తో సుదీర్ఘ పోరు తప్పదని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఆ దేశం ఈ విషయాన్ని పేర్కొన్నది. ఇరాన్ అణ్వాయుధాలు డెవలప్ చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేస్తోంది. కానీ ఇరాన్ మాత్రం ఆ ఆరోపణలను కొట్టిపారేస్తున్నది.
తమ న్యూక్లియర్ ప్రోగ్రామ్ శాంతియుతంగా సాగుతున్నట్లు ఆ దేశం చెబుతున్నది. మరో రెండు వారాల వరకు ఇరాన్ అంశంలో తటస్థంగా ఉండనున్నట్లు అమెరికా పేర్కొన్నది. ఇజ్రాయల్‌కు మద్దతు ఇస్తున్న అమెరికా.. దాడిలో నేరుగా పాల్గొనేందుకు మాత్రం నిర్ణయాన్ని వాయిదా వేసింది. మరో రెండు వారాల తర్వాత ఆ అంశంపై రియాక్టు కానున్నట్లు ట్రంప్ తెలిపారు.