న్యూఢిల్లీ: జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ శాంతిశ్రీ ధూళిపూడి ఓ పాడ్‌కాస్ట్‌లో యూజీసీ తాజాగా విడుదల చేసిన ‘సమానత్వ’ నిబంధనలపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కులతత్వ వ్యాఖ్యలు చేసిన వీసీ రాజీనామా చేయాలని జేఎన్‌యూ విద్యార్థి సంఘం శుక్రవారం డిమాండ్ చేసింది.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను శాంతిశ్రీ ఖండించారు. ఫిబ్రవరి 16న విడుదలైన పాడ్కాస్ట్పై విద్యార్థి సంఘం ఆరోపణలు గుప్పించింది. అందులో వీసీ మాట్లాడుతూ జేఎన్‌యూఎస్‌యూ ఆఫీస బేరర్ల సస్పెన్షన్, వర్సిటీకి ఏర్పడిన దేశ వ్యతిరేక ఇమేజ్ను తిప్పి కొట్టడం, సమానత్వ నిబంధనలపై మాట్లాడారు.