ముంబై, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. ముంబైలోని ములుంద్ ప్రాంతానికి చెందిన మొత్తం కుటుంబాన్ని ఒక నెల పాటు డిజిటల్ అరెస్ట్‌లో ఉంచి, వారిని బెదిరించి రూ.1.83 కోట్లు దోచుకున్నారు. దీనిపై కేసు నమోదైంది.
‘సుప్రీంకోర్టు నుండి రహస్య ఆదేశాలు వచ్చాయి. ప్రతి రెండు గంటలకు మీరు హాజరు కావాలి. లేకుంటే మిమ్మల్ని వెంటనే అరెస్టు చేస్తాం’ అని 62 ఏండ్ల రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్‌ను బెదిరించిన దుండగులు ఈ మోసానికి పాల్పడ్డారు.