Under -19 World Cup | దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్.. టాస్ గెలిచిన భారత్
Under -19 World Cup : అండర్ 19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా(South Africa)తో సెమీఫైనల్లో తలపడుతోంది. విల్లోమూరె పార్క్‌లో...
Under -19 World Cup : అండర్ 19 ప్రపంచకప్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత జట్టు(Team India) కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన దక్షిణాఫ్రికా(South Africa)తో సెమీఫైనల్లో తలపడుతోంది. విల్లోమూరె పార్క్‌లో జరుగుతున్న పోరులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ ఉదయ్ సహరన్ బౌలింగ్ తీసుకున్నాడు. టీమిండియా ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతుండగా.. ప్రొటిస్ జట్టు ఒక్క మార్పుతో ఆడుతోంది.
భారత జట్టు : ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహరన్(కెప్టెన్), ప్రియాన్షు మోలియా, సచిన్ ధాస్, అరవెల్లి అవినాష్(వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే.
India won the toss and elected to field in the #U19WorldCup semi-final!#INDvSAhttps://t.co/vXe5XBYZzX
— ICC Cricket World Cup (@cricketworldcup) February 6, 2024
దక్షిణాఫ్రికా జట్టు : లుమాన్ డ్రె ప్రిటోరియస్(వికెట్ కీపర్), స్టీవ్ స్టోల్క్, డేవిడ్ టీగర్, రిచర్డ్ సెలెట్స్వనే, డెవాన్ మరైస్, జువాన్ జేమ్స్(కెప్టెన్), ఒలివర్ వైట్‌హెడ్, రిలే నోర్టన్, ట్రిస్టన్ లూస్, కొబని మొకీన, క్వెనా మఫాకా.
🇮🇳 🆚 🇿🇦 Who comes out on top?
Two #U19WorldCup heavyweights clash for a place in the final 🏆 pic.twitter.com/XR0AqCEMyc
— ICC Cricket World Cup (@cricketworldcup) February 6, 2024
డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగుపెట్టిన భారత్ లీగ్ దశలో ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. కుర్రాళ్లు ముషీర్, ఉదయ్, కులకర్ణిలు శతకాలతో జోరు కొనసాగిస్తున్నారు. దాంతో, వరుసగా రెండో సారి ట్రోఫీ గెలవాలనే కసితో ఉంది. మరోవైపు సొంతగడ్డపై దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకున్నట్టే. ఆ జట్టు పేసర్ క్వెనా మఫాకా భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే అతడు 18 వికెట్లు పడగొట్టాడు. అందులో మూడు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- Rahul Gandhi | పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్లు ఇచ్చారు : రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్
- Hanuman | 25 రోజుల్లో 300 కోట్లు.. సరికొత్త రికార్డు సృష్టించిన హనుమాన్
- AUS vs WI | మూడో వన్డేలో విండీస్ విలవిల.. 3-0తో సిరీస్ నెగ్గిన ఆసీస్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

