Kalpana Soren | మీ ఇంటి ఆడబిడ్డలా నన్ను ఆశీర్వదించండి : కల్పనా సోరెన్
Kalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి, గండీ అసెంబ్లీ నియోజకవర్గ జేఎంఎం అభ్యర్థి కల్పనా సోరెన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
Kalpana Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి, గండీ అసెంబ్లీ నియోజకవర్గ జేఎంఎం అభ్యర్థి కల్పనా సోరెన్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం అంతా తిరుగుతూ తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. తాను ఒక ఆడబిడ్డనని, మీ ఆశీర్వాదం కోసం వచ్చానని, మీ అమూల్యమైన ఓటుతో నన్ను మీ ఇంటి ఆడబిడ్డలా ఆశీర్వదించాలని ఆమె కోరారు.
గండీ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆమె గిరిదిహ్ పట్టణంలో పర్యటించారు. వీధివీధికి వెళ్లి అక్కడి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. లోక్‌సభ ఐదో విడత ఎన్నికలతోపాటే మే 20న గండీ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల జరగనుంది. భూకుంభకోణం కేసులో ఇటీవల జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దాంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపాయ్ సోరెన్ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

