RCB vs GT : ఐపీఎల్ 17వ సీజన్ ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కీలక పోరుకు సిద్దమైంది. వరుస ఓటములతో అట్టడుగున ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)తో గిల్ సేన తలపడుతోంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో డూప్లెసిస్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఆర్సీబీ ఏ మార్పులు లేకుండా ఆడుతుండగా.. గుజరాత్ రెండు మార్పులు చేసింది.
బెంగళూరు తుది జట్టు : విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), కరన్ శర్మ, స్వప్నిల్ సింగ్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్.
గుజరాత్ తుది జట్టు : వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా, మానవ్ సుథార్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, జోషు లిటిల్.
ఇరుజట్లు తలపడిన గతమ్యాచ్లో గుజరాత్ గడ్డపై ఆర్సీబీ సూపర్ విక్టరీ కొట్టింది. ఆల్రౌండర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో కదం తొక్కగా.. విరాట్ కోహ్లీ(70 నాటౌట్) అర్ధ శతకంతో చెలరేగాడు. దాంతో, ఈసారి ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని గిల్ సేన భావిస్తోంది. అయితే.. సొంతగ అభిమానుల సమక్షంలో రెచ్చిపోయేందుకు బెంగళూరు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. దాంతో, గెలుపు కోసం ఇరువురి మధ్య తగ్గపోరు ఖాయం అనిపిస్తోంది.