Rahul Gandhi | పార్టీ కార్యకర్తకు కుక్క బిస్కెట్ ఇచ్చారు : రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్
Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓ శునకానికి ఇచ్చిన బిస్కెట్‌ను అది తినేందుకు నిరాకరించగా అదే బిస్కెట్‌ను పార్టీ కార్యకర్తకు ఇచ్చారని వైరల్ అవుతున్న వీడియోపై బీజేపీ ఘాటుగా స్పందించింది.
Rahul Gandhi : భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఓ శునకానికి ఇచ్చిన బిస్కెట్‌ను అది తినేందుకు నిరాకరించగా అదే బిస్కెట్‌ను పార్టీ కార్యకర్తకు ఇచ్చారని వైరల్ అవుతున్న వీడియోపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఈ వీడియోపై రియాక్టయిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ రాహుల్ లక్ష్యంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో జార్ఖండ్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్ ఇస్తుండటం కనిపించింది.
అదే సమయంలో పెద్దసంఖ్యలో అక్కడకు చేరిన పార్టీ కార్యకర్తలు రాహుల్‌తో మాట్లాడుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే ఈ వీడియోలో రాహుల్ గాంధీ కుక్క బిస్కెట్‌ను పార్టీ మద్దతుదారుడికి అందించినట్టు కనిపించలేదు. అయితే హిమంత బిశ్వ శర్మ ట్వీట్ చేసిన వైరల్ వీడియోలో కుక్క తినేందుకు నిరాకరించగా ఆ బిస్కెట్‌ను రాహుల్ పార్టీ వ్యక్తికి అందిస్తుండటం కనిపించింది. కాంగ్రెస్ నేత తన మద్దతుదారుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఆరోపణలు గుప్పించింది.
Pallavi ji, not only Rahul Gandhi but the entire family could not make me eat that biscuit. I am a proud Assamese and Indian . I refused to eat and resign from the Congress. https://t.co/ywumO3iuBr
— Himanta Biswa Sarma (@himantabiswa) February 5, 2024
గాంధీ వారసుల పార్టీ తనకు కూడా బిస్కెట్ తినిపించాలని చూసిన ఆత్మగౌరవం కలిగిన అస్సామీగా, భారతీయుడిగా నిరాకరించి ఆ పార్టీకి రాజీనామా చేశానని శర్మ పేర్కొన్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల వేళ వైరల్ డాగ్ బిస్కెట్ వీడియో బీజేపీకి ఆయుధంగా మారింది. కొద్దిరోజుల కిందట కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పార్టీ బూత్ ఏజెంట్లను కుక్కలతో పోలిస్తే లేటెస్ట్గా రాహుల్ గాంధీ తన యాత్రలో పార్టీ కార్యకర్తలకు కుక్క బిస్కెట్లు పంచారని బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాలవీయ విమర్శలు గుప్పించారు.
Read More :
Airtel | వినియోగదారులకు ఎయిర్టెల్ షాక్.. భారీగా పెరగనున్న టారిఫ్‌లు!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

