Kalki 2829 | ‘కల్కి 2898’ ప్రపంచాన్ని చూసేందుకు ప్రేక్షకలోకమంతా ఆసక్తిగా ఎదరుచూస్తున్నది. వైజయంతీ సంస్థ భారీ నిర్మాణ విలువలు, దర్శకుడు నాగ్అశ్వన్ దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్.. ఇంకా సూపర్స్టార్లయిన అమితాబ్, కమల్‌హాసన్ భాగం కావడం ఇవన్నీ ‘కల్కి 2898’పై అంచనాలు అంబరాన్ని తాకేలా చేశాయి. సైన్స్, మైథాలజీని మిళితం చేసి, ఓ వినూత్నమైన ఆలోచనతో నాగ్అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొని ఉంది.
దానికి తెర దించుతూ విడుదల తేదీని మేకర్స్ శనివారం ప్రకటించారు. జూన్ 27న ‘కల్కి 2898’ విడుదల కానుంది. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దిశా పటాని కూడా భాగం అయ్యింది. దుల్కర్ సల్మాన్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఇటీవలే ద్రోణసుతుడైన అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్‌ని పరిచయం చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను వేరే లోకానికి తీసుకెళ్లింది. త్వరలో మరిన్ని అద్భుతాలను చూస్తారని మేకర్స్ తెలిపారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మాత సి.అశ్వనీదత్ ఈ సినిమాను విడుదల చేయనున్నారు.