Airtel | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: ఇప్పటికే భారీగా పెరిగిన మొబైల్ టారిఫ్‌లు మరింత పెరగవచ్చని భారతి ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విఠల్ సంకేతాలిచ్చారు. సోమవారం కంపెనీ ఆర్థిక ఫలితాల సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో.. కంపెనీ పెట్టుబడులపై రాబడి ఇంకా కనిష్ఠంగా 9.4 శాతమే ఉన్నదని, పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలంటే టారీఫ్‌ల పెంపు కీలకమని వివరించారు.
డిసెంబర్‌తో ముగిసిన మూడవ త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నికర లాభం 54 శాతం వృద్ధిచెంది రూ.2,442 కోట్లకు చేరింది. ఆదాయం 5.8 శాతం వృద్ధితో రూ. 37,899 కోట్లకు పెరిగింది. భారత్‌లో కంపెనీ చందాదారుల సంఖ్య 7.5 శాతం పెరిగి 39.7 కోట్లకు చేరింది. ఏవరేజ్ రెవిన్యూ పర్ యూజర్ పర్ (ఏపీఆర్‌యూ) 7.7 శాతం వృద్ధితో రూ. 193 నుంచి రూ.208కి చేరింది.