Womens ODI World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సన్నద్ధతలో భాగంగా భారత జట్టు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. పుష్కర కాలం తర్వాత ఉపఖండంలో జరుగనున్న ఈ మెగా టోర్నీలో పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో టీమిండియా తలపడనుంది. చిన్నస్వామి స్టేడియంలో సెప్టెంబర్ 25న ఇంగ్లండ్‌ను, 27న కివీస్‌ను హర్మన్‌ప్రీత్ కౌర్ సేన ఢీకొననుంది. మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) వరల్డ్ కప్ వామప్ మ్యాచ్‌ల వేదికలను, తేదీలను ప్రకటించింది.
ఆనవాయితీ ప్రకారం ప్రపంచ కప్ సంసిద్ధతగా భావించే ఈ మ్యాచ్‌లను బెంగళూరు, శ్రీలంకలోని కొలంబో మైదానంలో జరపాలని ఐసీసీ తీర్మానించింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు కొలంబోలో ఆడుతాయని తెలిపింది. పన్నెండేళ్ల తర్వాత మహిళల వన్డే వరల్డ్ కప్ పోటీలకు ఉపఖండం ఆతిథ్యమిస్తోంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించే ఈ టోర్నీ సెప్టెంబర్ 30న షురూ కానుంది. నవంబర్ 12న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో టైటిల్ విజేత ఎవరో తేలిపోనుంది.
The warm-up fixtures of ICC Women’s Cricket World Cup 2025 are here 🙌#TeamIndia will face England and New Zealand in the two warm-up matches ahead of #CWC25 👌👌 pic.twitter.com/wqga0i0cQj
— BCCI Women (@BCCIWomen) July 15, 2025
హైబ్రిడ్ మోడల్లో జరుగబోయే ఈ టోర్నీని ఐదు వేదికలపై నిర్వహిస్తారు. భారత్‌లోని బెంగళూరు, గువాహటి, విశాఖపట్నం, ఇండోర్ స్టేడియాల్లో, లంకలోని కొలంబోలో వరల్డ్ కప్ మ్యాచ్‌లు అభిమానులను అలరించనున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ మెగా ఈవెంట్లో రెండు గ్రూపులో టాప్ -4 జట్లు సెమీస్‌కు దూసుకెళ్తాయి. అగ్రస్థానంలోని జట్టు నాలుగో ప్లేస్‌లోని టీమ్ ఢీకొననుండగా.. రెండో స్థానంలో నిలిచిన జట్టుతో మూడో ప్లేస్‌లోని జట్టు తలపడనుంది. బెంగళూరులో జరుబోయే వరల్డ్ కప్ ఆరంభ పోరులో భారత జట్టు సెప్టెంబర్ 30న శ్రీలంకతో తాడోపేడో తేల్చుకోనుంది.
సెప్టెంబర్ 25న.. బెంగళూరులో.. భారత్ వర్సెస్ ఇంగ్లండ్ – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్, దక్షిణాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ – చిన్నస్వామి స్టేడియం.
కొలంబోలో.. శ్రీలంక వర్సెస్ పాకిస్థాన్ – కొలంబో క్రికెట్ క్లబ్.
బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక ‘ఏ’ జట్టు – ప్రేమదాస స్టేడియం.
సెప్టెంబర్ 27న..
బెంగళూరు.. ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లండ్ – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ – చిన్నస్వామి స్టేడియం.
కొలంబో.. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్ – కొలంబో క్రికెట్ క్లబ్.
సెప్టెంబర్ 28న .. బెంగళూరు దక్షిణాఫ్రికా వర్సెస్ భారత్ – బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 1 గ్రౌండ్.
కొలంబో .. పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక ‘ఏ’ జట్టు – కొలంబో క్రికెట్ క్లబ్.