Govt Schools | పాపన్నపేట, జులై 15 : ప్రభుత్వ పాఠశాలల సర్వతోముఖాభివృద్ధికి విద్యావేత్తలు, దాతలు సహాయ సహకారాలు అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకిషన్ సూచించారు. మంగళవారం మండల కేంద్రమైన పాపన్నపేటలోని చిన్న, పెద్ద హరిజనగడ్డలతోపాటు ప్రాథమిక, పాఠశాల విద్యార్థులకు ఎంఈఓ ప్రతాపరెడ్డి, ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్‌తో కలిసి నోట్‌బుక్స్, బ్యాగులు, వాటర్ బాటిల్స్, పెన్ను పెన్సిళ్లు ఆయన చేతుల మీదుగా అందించారు. వీటిని అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యక్తిగత వైద్యుడు మన్నే ఉపేందర్ తమ సొంత డబ్బులతో అందించారు.
ఉపేందర్ పాపన్నపేట ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి అవడం గమనార్హం. ఉపేందర్ మండల వ్యాప్తంగా విద్యార్థుల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు వెచ్చిస్తూ వివిధ వస్తువులు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా డీఈవో ఉపేందర్ సేవలను ప్రశంసించారు. అనంతరం పాపన్నపేట ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు మంగ నరసింహులు రూపొందించిన పాఠ్య ప్రణాళికలను ఆయన చేతులమీదుగా విడుదల చేశారు.
అనంతరం పాఠశాల రికార్డులను, ఉపాధ్యాయుల అటెండర్స్ రిజిస్టర్ పరిశీలించారు, ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ పనితీరును అభినందించారు ఆయన వెంట ఉపాధ్యాయులు అంజా గౌడ్ ,నాగరాజు రమేష్ ,సుభాష్ తదితరులున్నారు.
Maddur | వర్షాల కోసం బతుకమ్మ ఆడిన మహిళలు
Bonalu | గుమ్మడిదలలో ఘనంగా ఎల్లమ్మతల్లి బోనాలు
Congress leader | మెదక్ జిల్లాలో కాంగ్రెస్ యువ నాయకుడు అనుమానాస్పద మృతి