ఆత్మకూరు(ఎం), జూలై 15 : ఆర్మీ అసోసియేషన్ ఆత్మకూరు(ఎం) నూతన కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన ఈ ఎన్నికలో కమిటీ గౌరవాధ్యక్షుడిగా లోడి రామకృష్ణ, అధ్యక్షుడిగా యాస ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా మరాఠి లింగస్వామి, ఉపాధ్యక్షుడిగా లోడి మల్లేశ్, కార్యదర్శిగా బత్తిని ప్రదీప్, కార్యవర్గ సభ్యులుగా కిట్టు, నర్సింహ్మ, నవీన్, వెంకన్న తదితరులను ఎన్నుకున్నారు.