IND vs NZ 3rd Test : ముంబై టెస్టులో భారత జట్టు విజయం వాకిట తడబడుతోంది. బంతి టర్న్ అవుతుండడంతో అజాజ్ పటేల్ (2/14) విజృంభించాడు. దాంతో, 18 పరుగులకే ముగ్గురు కీలక ఆటగాళ్లు ఔటయ్యారు. ప్రస్తుతం యశస్వీ జైస్వాల్(5), రిషభ్ పంత్(6) క్రీజులో ఉన్నారు.
మూడో రోజు తొలి సెషన్లో న్యూజిలాండ్‌ను 174 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ(11), శుభ్‌మన్ గిల్(1), విరాట్ కోహ్లీ(1)లు నిరాశపరిచారు. ప్రస్తుతం యశస్వీ జైస్వాల్(5), రిషభ్ పంత్(6) క్రీజులో ఉన్నారు. ఇంకా భారత జట్టు విజయానికి 119 పరుగులు కావాలి.
The skipper Rohit Sharma falls, and soon after, Gill has been bowled!
India are 16/2, needing another 131 runs to win in Mumbai 👉 https://t.co/Vq9uHVazcz | #INDvNZ pic.twitter.com/9U1zghqekf
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2024
ఓవర్ నైట్ స్కోర్ 17/19తో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ మరో 3 పరుగులకే ఆలౌటయ్యింది. అజాబ్ పటేల్‌ను వెనక్కి పంపిన రవీంద్ర జడేజా(5/55) ఐదో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాకు మ్యాట్ హెన్రీ ఊహించని షాకిచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో మాదిరిగానే మళ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ(11)ను పెవిలియన్ పంపి బ్రేకిచ్చాడు.
ఆ షాక్ నుంచి తేరుకునేలోపే అజాజ్ పటేల్ సూపర్ బంతితో శుభ్‌మన్ గిల్(1)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ(1) సైతం డిఫెన్స్ ఆడబోయి స్లిప్‌లో డారిల్ మిచెల్ చేతికి చిక్కాడు. చూస్తుండడానే 3 పెవిలియన్ చేరగా.. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.