IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో పొట్టి సిరీస్‌ను పట్టేసేందుకు భారత జట్టు సిద్ధమైంది. వరుసగా రెండో విజయంతో జోరు మీదున్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సేన మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు సికిందర్ రజా నేతృత్వంలోని ఆతిథ్య జట్టు విజయంతో సిరీస్ సమం చేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. దాంతో, భారత్, జింబాబ్వేల మధ్య తగ్గపోరు ఉండనుంది.
ఓటమితో సిరీస్‌ను ఆరంభించినా.. ఆ తర్వాత భారత కుర్రాళ్లు దంచేస్తున్నారు. ఓపెనర్‌గా అభిషేక్ శర్మ మెరుపు సెంచరీతో బోణీ కొట్టిన టీమిండియా ఆ తర్వాతి గేమ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఐదు టీ20ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న గిల్ సేన ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ అందినట్టే.

అయితే.. వరల్డ్ కప్ త్రయం యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, శివం దూబేల రాకతో జట్టు కూర్పు పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో మూడో టీ20 ఆడిన జట్టునే కొనసాగిస్తారా? పేసర్ ముకేశ్ కుమార్‌ను ఆడిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. జూలై 13 శనివారం సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది.
భారత జట్టు అంచనా : శుభ్‌మన్ గిల్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్, ఖలీల్ అహ్మద్.
జింబాబ్వే జట్టు అంచనా : తడివనషె మరుమని, వెస్లీ మధెవెరె, బ్రియాన్ బెన్నెట్, డియాన్ యెర్స్, సికిందర్ రజా(కెప్టెన్), జొనాథన్ క్యాంప్‌బెల్, క్లైవ్ మడండె(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకజ్ద, రిచర్డ్ గరవె, బ్లెస్లింగ్ ముజరబని, టెండాయ్ చతర.