Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) హాలీ డేను ఎంజాయ్ చేస్తున్నాడు. వరల్డ్ కప్‌లో నీలి రంగు జెర్సీతో ట్రోఫీ పట్టేసిన హిట్‌మ్యాన్ ఇప్పుడు సూట్ బూటు గెటప్‌లోకి మారాడు. ఫ్యామిలీతో లండన్ పర్యటనకు వెళ్లిన రోహిత్.. వింబుల్డన్ (Wimbledon) టోర్నమెంట్లో తళుక్కుమన్నాడు.
విజిటర్స్ గ్యాలరీలో కూర్చొని సెమీఫైనల్ మ్యాచ్ వీక్షించాడు. దాంతో, వరల్డ్ కప్ హీరో రోహిత్‌కు వింబుల్డన్ నిర్వాహకులు స్వాగతం చెప్తూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
Welcome to #Wimbledon, Rohit Sharma 👋🏏 pic.twitter.com/9JtzTMvXzp
— Wimbledon (@Wimbledon) July 12, 2024
వరల్డ్ కప్ ట్రోఫీతో విజయాన్ని మనసారా అస్వాదించిన రోహిత్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్లాడు. ముంబైలో ఓపెన్ టాప్ బస్సు విక్టరీ పరేడ్.. వాంఖడేలో సన్మాన కార్యక్రమం తర్వాత హిట్‌మ్యాన్ లండన్‌కు వెళ్లాడు. శుక్రవారం
కార్లోస్ అల్కరాజ్, డానిల్ మెద్వెదేవ్ మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌ను రోహిత్ వీక్షించాడు. రోహిత్‌తో పాటు మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ సైతం ఫ్యామిలీతో వింబుల్డన్ మ్యాచ్ చూశాడు.
బార్బడోస్ గడ్డపై చిరస్మరణీయ విజయంతో యావత్ భారతం గర్వపడేలా చేసిన హిట్‌మ్యాన్ తాజాగా తన ‘ఎక్స్’ ఖాతా డీపీ మార్చాడు. త్వరలోనే టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్లనుంది. కానీ, రోహిత్ సహా సీనియర్లు విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చిన విషయం తెలిసిందే.