Saina Nehwal : ఒలింపిక్ విజేతగా ఓ వెలుగు వెలిగిన సైనా నెహ్వాల్ (Saina Nehwal) రాకెట్ వదిలేసి దాదాపు ఆరేండ్లు అవుతోంది. వివాహం తర్వాత ఆటకు దూరమైన ఆమె తాజాగా క్రికెట్‌పై సంచలన కామెంట్ చేసింది. దాంతో, కోల్‌కతా నైట్ రైడర్స్ యువకెరటం అంగ్క్రిష్ రఘువంశీ (Angkrish Raghuvamshi)సైనాకు టార్గెట్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. ‘బుమ్రా 150 కిలోమీటర్ల వేగంతో ఆమె తలపైకి బౌన్సర్‌ను విసిరితే ఏం చేస్తుందో చూడాలి’ అనే అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టాడు.
అయితే.. అది కాస్త మిస్ ఫైర్ కావడంతో ‘అదొక బ్యాడ్ జోక్’ అంటూ సైనాకు సారీ చెప్పాడు. అంతేకాదు వెంటనే తన పోస్ట్‌ను డిలీట్ చేశాడు. అసలేం జరిగిందంటే…? తాజాగా రాష్ట్రపతి భవన్లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) తో సైనా సరదాగా బ్యాడ్మింటన్ ఆడింది. అనంతరం ‘మై స్టోరీ – హర్ స్టోరీ’ సిరీస్‌లో మాట్లాడిన వీడియోలో ఆన్లైన్లో వైరల్ అయింది. బ్యాడ్మింటన్ బదులు టెన్నిస్ ఆడి ఉంటే బాగుండు అని తనకు అప్పుడప్పుడు అనిపించేదని అంది. అంతేకాదు ‘టెన్నిస్, బ్యాడ్మింటన్ కంటే క్రికెట్ ఏమంత కష్టమేమీ కాదు.

మనదేశంలో క్రికెట్‌కు ఉన్న ఆదరణ చూస్తే అసూహ వేస్తుంది. ఎందుకంటే.. క్రికెట్‌కు మాత్రమే క్రేజ్ ఉంటే భారత్ క్రీడా దేశం ఎలా అవుతుంది?. ఒలింపిక్స్‌లో చైనాతో పోటీ పడి పతకాలు ఎలా గెలవగలం’ అని అంది. దాంతో, రఘువంశీ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ.. బుమ్రా 150 కిలోమీటర్ల వేగంతో ఆమె తలపైకి బౌన్సర్‌ను విసిరితే ఏం చేస్తుందో చూడాలి అని ఓ పోస్ట్ పెట్టాడు.
💀 dlt krdiya pic.twitter.com/G1Hb2jkiFM
— Ashish Shrivastava (@ashishayush1177) July 12, 2024
ఆ పోస్ట్ చూసిన చాలామంది సైనాకు మద్దుతగా నిలుస్తూ రఘువంశీని ఆడేసుకున్నారు. దాంతో, తన తప్పు గ్రహించిన కోల్‌కతా కుర్రాడు ఆ పోస్ట్‌ను తొలగించి సైనాకు సారీ చెప్పాడు. ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రఘువంశీ దంచికొట్టాడు. 10 మ్యాచుల్లో ఈ యంగ్‌స్టర్ 163 రన్స్ కొట్టాడు.