Oppo Reno 12 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo).. రెనో సిరీస్లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్లతో ఒప్పో రెనో 12 (Oppo Reno 12), ఒప్పో రెనో 12 ప్రో (Oppo Reno 12 Pro) అనే ఫోన్లను తెచ్చింది. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ చిప్ సెట్ తో వస్తోందీ ఫోన్. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14.1 వర్షన్ పై పని చేస్తుంది. మూడేండ్లు ఓఎస్ అప్ గ్రేడ్స్, నాలుగేండ్లు సెక్యూరిటీ అప్ గ్రేడ్స్ అందిస్తామని పేర్కొంది ఒప్పో. 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది.
ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.36,999 పలుకుతుంది. స్పేస్ బ్రౌన్, సన్ సెట్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. ఈ నెల 18 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. ఇక ఒప్పో రెనో 12 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.32,999లకు లభిస్తుంది. ఈ నెల 25 నుంచి ఒప్పో రెనో 12 5జీ ఫోన్ సేల్స్ మొదలవుతాయి. ఫ్లిప్ కార్ట్, ఒప్పో ఇండియా వెబ్ సైట్లలో రెండు ఫోన్లూ లభ్యం అవుతాయి.
రెండూ ఫోన్లూ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ ప్లే తో వస్తున్నాయి. ఈ డిస్ ప్లే హెచ్డీఆర్ 10+కు మద్దతుగా ఉంటుంది. ఔట్ డోర్స్ లో 1200 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది. ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, ఒప్పో రెనో 12 5జీ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ కోటింగ్ ప్రొటెక్షన్ కలిగి ఉంటాయి. ఒప్పో రెనో 12 సిరీస్ ఫోన్లు రెండూ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఎనర్జీ ఎస్వోసీతోపాటు 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ కెపాసిటీ కలిగి ఉంటాయి. మైక్రో ఎస్డీ కార్డు సాయంతో ఒక టిగా బైట్ వరకూ స్టోరేజీ కెపాసిటీ పెంచుకోవచ్చు.
ఒప్పో రెనో 12 5జీ సిరీస్ ఫోన్లు రెండూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సోనీ ఎల్వైటీ 600 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50-మెగా పిక్సెల్ శాంసంగ్ ఎస్5కేజేఎన్5 టెలిఫోటో సెన్సర్ విత్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50 మెగా పిక్సెల్ శాంసంగ్ ఎస్5కేజేఎన్5 సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఒప్పో రెనో 12 5జీ ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 సెన్సర్ కెమెరా విత్ ఓఐఎస్, 8-మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 సెన్సర్, 2-మెగా పిక్సెల్ మాక్రో సెన్సర్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. ఒప్పో రెనో 12 5జీ, ఒప్పో రెనో 12 ప్రో 5జీ ఫోన్లలో ఏఐ సమ్మరీ, ఏఐ రికార్డ్ సమ్మరీ, ఏఐ క్లియర్ వాయిస్, ఏఐ రైటర్, ఏఐ స్పీక్ వంటి ఏఐ ఇంటిగ్రేటెడ్ ఫీచర్లు జత చేశారు. ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ ఎరేజర్ 2.0 తోపాటు ఏఐ బేస్డ్ కెమెరా ఫీచర్లూ ఉంటాయి. రెండు ఫోన్లూ 5జీతోపాటు బ్లూటూత్ 5.4, ఐఆర్ బ్లాస్టర్, వై-ఫై 6 కనెక్టివిటీ కలిగి ఉంటాయి. సెక్యూరిటీ అండ్ అథంటికేసన్ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్ లాక్ ఫీచర్ ఉంటాయి.