Man, Girlfriend Kills Woman | మహిళను హత్య చేసిన వ్యక్తి, అతడి ప్రియురాలు.. ట్రయాంగిల్ లవ్‌లో ట్విస్ట్
Man, Girlfriend Kills Woman | ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ప్రేమిస్తున్న మహిళను హత్య చేశాడు. అనంతరం వేరే రాష్ట్రానికి పారిపోయాడు. యువతి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ట్రయాంగిల్ లవ్ ట్విస్ట్‌ను ఛేదించారు. ఆ వ్యక్తి, అతడి ప్రియురాలిని అరెస్ట్ చేశారు.
భోపాల్: ఒక వ్యక్తి తన ప్రియురాలితో కలిసి ప్రేమిస్తున్న మహిళను హత్య చేశాడు. అనంతరం వేరే రాష్ట్రానికి పారిపోయాడు. యువతి మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేశారు. ట్రయాంగిల్ లవ్ ట్విస్ట్‌ను ఛేదించారు. ఆ వ్యక్తి, అతడి ప్రియురాలిని అరెస్ట్ చేశారు. (Man, Girlfriend Kills Woma) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 26న 21 ఏళ్ల సారా సయ్యద్ అదృశ్యమైంది. ఆమె కుటుంబం ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బీ ఫార్మసీ విద్యార్థి అయిన 23 ఏళ్ల గౌరవ్ సర్కార్‌తో కలిసి సారా చివరిసారి కనిపించినట్లు గుర్తించారు. ఆమె గురించి అతడ్ని ప్రశ్నించారు. అయితే తనకేమీ తెలియదని బుకాయించాడు.
కాగా, గోనె సంచిలో కుక్కి పడేసిన సారా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆమె హత్యపై దర్యాప్తు చేశారు. సారాపై గౌరవ్ సర్కార్ మనసుపడినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే మరో వ్యక్తిని ఆమె ప్రేమించడంతో ప్రియురాలైన 18 ఏళ్ల స్నిగ్ధా మిశ్రా, గౌరవ్ కలిసి సారాను హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది.
మరోవైపు గౌరవ్, స్నిగ్ధా కలిసి హర్సోలా ఫాటాలోని నిర్జన ప్రదేశంలో సారాను హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఆమె గొంతు కోసి చంపారని, మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి చెట్లపొదల్లో పడేశారని చెప్పారు. మహారాష్ట్రలోని నాసిక్ పారిపోయిన గౌరవ్ ఒక హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం అందిందని వివరించారు. దీంతో గౌరవ్, అతడి ప్రియురాలైన స్నిగ్ధాను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
MBBS Seats: తమిళనాడు, పుదుచ్చరిలో 800 ఎంబీబీఎస్ సీట్లు ఖాళీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

