మీనాక్షి ఔట్
ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుని ఆదేశాల మేరకు బీఎం సందీప్‌ను ఇన్చార్జిగా తక్షణమే నియమిస్తున్నట్టు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
-
కాంగ్రెస్ తెలంగాణ ఇన్చార్జిగా బీఎం సందీప్
-
తక్షణమే నియమిస్తున్నట్టు వేణుగోపాల్ ప్రకటన
-
రాష్ట్రంలో రాహుల్ పర్యటన రోజే నిర్ణయం
-
రాహుల్ పర్యటన వేళ అధిష్ఠానం కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జిగా బీఎం సందీప్ నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుని ఆదేశాల మేరకు బీఎం సందీప్‌ను ఇన్చార్జిగా తక్షణమే నియమిస్తున్నట్టు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు ఇన్చార్జిగా పనిచేసిన మీనాక్షి నటరాజన్ సేవలను పార్టీ అభినందిస్తున్నట్టు పేరొన్నారు.

గాంధేయవాదిగా, నిరాడంబర నాయకురాలిగా పేరున్న మీనాక్షి నటరాజన్‌కు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహా పలువురు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలకు మధ్య కొంతకాలంగా పార్టీ సంస్థాగత వ్యవహారాల విషయంలో తీవ్ర అభిప్రాయభేదాలు తలెత్తినట్టు సమాచారం. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఎంపీగా నామినేషన్ దాఖలు చేసే సమయంలో, ఆమెపై పెండింగ్‌లో ఉన్న ఓ కేసుకు సంబంధించిన వివరాలు అకస్మాత్తుగా పొరుగు రాష్ర్టానికి లీక్ కావడం సంచలనం రేపింది. సొంత పార్టీలోని ఓ వర్గమే కావాలని ఈ సమాచారాన్ని బయటకు పొకించిందనే అనుమానాలు బలంగా వ్యక్తమవడంతో, ఆమె తీవ్ర మనస్తాపానికి గురై రాష్ట్ర నాయకత్వంపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేవరకు వెళ్లినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

