Rains | రాష్ట్రంపై అల్పపీడన ప్రభావం.. 3 రోజుల పాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
Rains | అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.
Rains | హైదరాబాద్ : అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లోఅలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో ఉరుములు,మెరుపులు,ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాలో 5.04 సెం.మీ, తల్లాడలో 4.34 సెం.మీ, భద్రాద్రి-కొత్తగూడెం అశ్వరావుపేటలో 4.13 సెం.మీ, కొల్లూరులో 3.82 సెం.మీ, పెనుబల్లిలో 3.27 సెం.మీ, సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్)లో 4.05, జనగామ జిల్లా దేవరుప్పలలో 3.28 సెం.మీ చొప్పున వర్షపాతం వర్షపాతం నమోదైంది. గురువారం రాత్రి తూర్పు, మధ్య తెలంగాణలోని పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర,తూర్పు, మధ్య తెలంగాణలో శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.
దక్షిణ తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది. హైదరాబాద్ నగరంలోనూ సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. యాదాద్రి, జనగామ, మహబూబ్‌నగర్, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల వర్షం కురిసింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు చురుకుగా మారడంతో రాబోయే రెండు వారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
MLA Prakash Goud | కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shabbir Ali: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్‌పై తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం సస్పెన్షన్
Roshan Kanakala | మరో డిఫరెంట్ జానర్‌తో రాబోతున్న రోషన్ కనకాల.. ఈసారి వీఐ ఆనంద్ కథతో కొత్త ప్రయోగం!
Upasana | దీపావళి వేడుకల్లో స్టార్ హీరోల భార్యల సందడి.. ఒకే ఫ్రేమ్‌లో ఉపాసన, స్నేహారెడ్డి, నమ్రత.. ఫొటోలు వైరల్!
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దీపావళి విషాదం.. 2 ప్రమాదాల్లో 12 మంది మృతి.. రెండు కుటుంబాలు బుగ్గి
Uttar Pradesh | యూపీలో మంటల్లో చిక్కుకున్న కారు.. చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

