Himanshu Birthday | హైదరాబాద్ : తన మనుమడు హిమాన్షును బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆశీర్వదించారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో హిమాన్షు తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. శతమానం భవతి అని తాతయ్య, నానమ్మ హిమాన్షును ఆశీర్వదించారు. హిమాన్షు 19వ ఏట అడుగు పెట్టడంతో.. 19 కిలోల కేక్‌ను కుటుంబ సభ్యులు కట్ చేయించారు.
అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ పిలుపుమేరకు హిమాన్షు మొక్కను నాటారు. హిమాన్షు పుట్టిన రోజు వేడుకల్లో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, అమ్మమ్మ శశికళ, వినోదమ్మ, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ సహా పలువురు కుటుంబ సభ్యులతోపాటు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Happy Birthday Buddy ❤️
Stop growing up so fast https://t.co/pRgyjU76oB
— KTR (@KTRBRS) July 12, 2024
ఇవి కూడా చదవండి..
MLA Prakash Goud | కాంగ్రెస్‌లో చేరిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
CM Revanth | బలమైన వ్యవస్థగా ‘హైడ్రా’ ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ సూచన
Bandi Sanjay | ఓయూలో తిరిగి నిరుద్యోగులతో మాట్లాడే దమ్ముందా? రాహుల్ గాంధీకి బండి సంజయ్ సవాలు
Samvidhaan Hatya Diwas | ఎమర్జెన్సీకి నిరసనగా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్