Hannah Bevinton : బ్రిటన్ దేశానికి చెందిన ఓ మహిళ (Britain Women) తన పాత దుస్తులు (Old clothes) అమ్మి ధనికురాలైంది. ఆమె కేవలం తన పాత దుస్తులు మాత్రమే విక్రయించలేదు. పాత దుస్తులతోపాటు పాత బూట్లు (Old Shoes), పాత రోల్డ్ గోల్డ్ (Old rolled gold) ఆభరణాలను కూడా విక్రయించింది. దాంతో లక్షలు రాబట్టింది. అంతేకాదు పాత దుస్తులతో లక్షలు రాబట్టడానికి కొన్ని బిజినెస్ మెలుకువలు కూడా చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌కు చెందిన హన్నా బెవింగ్టన్ (Hanna Bevington) అనే మహిళ పాత వస్తువులు విక్రయించే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ వింటెడ్ (Vinted) లో తన దుస్తులను విక్రయానికి పెట్టింది. వాటితోపాటు తన పాత బూట్లు, పాత రోల్డ్ గోల్డ్ ఆభరణాలను కూడా విక్రయానికి ఉంచింది. వాటిని అమ్ముకోవడం ద్వారా ఆమె రూ.6,44,331 నగదు వచ్చింది.
పాత వస్తువులతో ఎక్కువ సొమ్మును ఎలా ఆర్జించవచ్చో కొన్ని మెలుకువలు కూడా చెప్పింది. మనం అమ్మదల్చుకున్న పాత వస్తువు ధరను దాని అసలు ధర కంటే బాగా తగ్గించకూడదని తెలిపింది. ఇలా తగ్గించడం వల్ల కొనుగోలుదారు దాన్ని చీప్‌గా చూస్తాడని చెప్పింది. అదేవిధంగా అప్పుడొకటి, అప్పుడొకటి కాకుండా కనీసం 100 వస్తువులను ఏకకాలంలో విక్రయానికి పెట్టాలని సూచించింది.
దీనివల్ల వారాంతాల్లో మీ వస్తువులు ఎక్కువ సంఖ్యలో అమ్ముడుపోయే ఛాన్స్ ఉందని చెప్పింది. అంతేగాక మీరు అమ్మదల్చుకున్న వస్తువులకు సంబంధించిన ఫొటోలను నీట్ తీయాలని, దానిపై మీరు ఇస్తున్న ఆఫర్ కూడా స్పష్టంగా కనిపించాలని, అసలు ధరకంటే 10 నుంచి 15 శాతం తక్కువ చేసి ఆఫర్ ప్రకటించాలని హన్నా బెవింగ్టన్ తెలిపింది.