IND vs BAN 2nd Test | యశస్వీ, రాహుల్ వీరకొట్టుడు.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
IND vs BAN 2nd Test : కాన్పూర్ టెస్టులో ఫలితంపై ఉత్కంఠ నడుస్తోంది. ఏది ఏమైనా సరే గెలుపే లక్ష్యంగా ఆడతున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నాలుగో రోజు బంగ్లాను ఆలౌట్ చేసిన వెంటనే టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది.
IND vs BAN 2nd Test : కాన్పూర్ టెస్టులో ఫలితంపై ఉత్కంఠ నడుస్తోంది. ఏది ఏమైనా సరే గెలుపే లక్ష్యంగా ఆడతున్న భారత జట్టు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. నాలుగో రోజు బంగ్లాను ఆలౌట్ చేసిన వెంటనే టీమిండియా ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది. యశస్వీ జైస్వాల్(72), కేఎల్ రాహుల్(56)లు మెరుపు అర్ధ శకతాలతో చెలరేగారు. విరాట్ కోహ్లీ(47) సైతం బ్యాట్ ఝులిపించాడు. అయితే.. దూకుడుగా ఆడే క్రమంలో భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. పేసర్ ఆకాశ్ దీప్(12) వికెట్ పడగానే కెప్టెన్ రోహిత్ శర్మ 285-9 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు.
A KLassical FIFTY by @klrahul 👏👏
His 15th and fastest in Test cricket!
Live – https://t.co/JBVX2gyyPf… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/gHXdkM1WiT
— BCCI (@BCCI) September 30, 2024
నాలుగో రోజు బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసితో ఆడుంతోంది. అందులో భాగంగానే ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(72) రోహిత్ శర్మ(23) మెరుపు బ్యాటింగ్‌తో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. యశస్వీ అయితే.. తనదైన దూకుడుతో అర్ధ సెంచరీ బాదేయగా.. శుభ్‌మన్ గిల్(39) సైతం ఉన్నంత సేపు దంచాడు. దాంతో, 10.1 ఓవర్లనే భారత జట్టు 100 రన్స్ కొట్టి చరిత్ర సృష్టించింది. అనంతరం కోహ్లీ, రాహుల్‌లు విధ్వంసాన్ని తారాస్థాయికి చేరింది.
ధాటిగా ఆడబోయి.. వరుసకట్టి
రిషభ్ పంత్(8) ఔటయ్యాక గేర్ మార్చిన రాహుల్, కోహ్లీలు బంగ్లా బౌలర్లను ఉతికేశారు. రాహుల్ అయితే.. కళాత్మక షాట్లతో బౌండరీలు రాబట్టి స్కోర్ బోర్డును ఉరికించాడు. మరో ఎండ్‌లో విరాట్ సైతం దంచాడు. కానీ, ధాటిగా ఆడబోయిన కోహ్లీ హాఫ్ సెంచరీ ముందు షకీబుల్ హసన్ ఓవర్లో బౌల్డ్ అయ్యాడు.
Innings Break!#TeamIndia have declared after scoring 285/9 in just 34.4 overs and have a lead of 52 runs 👏👏
Bangladesh 2nd innings coming up.
Scorecard – https://t.co/JBVX2gz6EN#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/8tbuFb6GiT
— BCCI (@BCCI) September 30, 2024
ఆ కాసేపటికే జడేజా, అశ్విన్, రాహుల్‌లు సైతం వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన ఆకాశ్ దీప్(12) రెండు వరుస సిక్సర్లు బాదేసి ఔటయ్యాడు. అప్పటికీ టీమిండియా ఆధిక్యం 52 పరుగులకు చేరింది. ఆ వెంటనే హిట్‌మ్యాన్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడంతో బంగ్లా రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది.
మొమినుల్ వీరోచిత శతకం
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ తడబడినా మొమినుల్ హక్(107), ముష్ఫికర్ రహీం(11)ల అసమాన పోరాటంతో నిలబడింది. రెండు రోజులు ఆట రద్దయ్యాక నాలుగో రోజు 1073తో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాకు మొనిల్ హక్ భారీ స్కోర్ అందించాడు. అతడు రెండో సెంచరీతో చెలరేగగా బంగ్లాదేశ్ 233 స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు, సిరాజ్, ఆకాశ్ దీప్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఇవి కూడా చదవండి
- IND vs BAN 2nd Test | యశస్వీ, రాహుల్ వీరకొట్టుడు.. ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన భారత్
- Kamal Haasan | సల్మాన్ ఖాన్, అట్లీ సినిమాకు కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేనా..?
- నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ? ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని నిలదీసిన దాస్యం
- Virat Kohli | అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ప్రభంజనం.. వరల్డ్ రికార్డు బద్ధలైందిపో
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

