షాద్‌నగర్‌రూరల్, ఆగస్టు 10 : తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ఇతర పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని అయ్యవారిపల్లి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు శివ ధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు సోమవారం అంజయ్యయాదవ్ సమక్షంలో గులా బీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అంజయ్యయాదవ్ మాట్లాడుతూ.. 32 నెలలు దాటినా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడంలేదని ఆరోపించారు.
రేవంత్ సర్కార్ ప్రజావ్యతిరేక కార్యక్రమాలు కొనసాగిస్తుండటంతో ప్రజలు ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు. కేసీఆర్ సారథ్యంలోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని గ్రహించి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో నర్సింహులు, లింగం, చందు, రమేశ్, శివ, నందు, ప్రసాద్, ఆకాశ్, వినయ్, రాఖీ, హరీశ్, చింటు, యశ్వంత్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.