Virat Kohli : రన్ మెషీన్‌గా పేరొందిన భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) మరో ఘనత సాధించాడు. నిరుడు 50వ వన్డే శకతంతో ప్రకంపనలు రేపిన విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో 27 వేల పరుగుల మైలురాయికి చేరుకున్నాడు. అత్యంత వేగంగా ఈ క్లబ్లో చేరిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
కాన్పూర్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ధనాధన్ ఆడిన కోహ్లీ ఈ ఫీట్ సొంతం చేసుకున్నాడు. విరాట్ 594 ఇన్నింగ్స్‌ల్లోనే 27 పరుగుల క్లబ్లో చేరాడు. భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ 2007లో 623 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయిని అందుకున్నాడు. కానీ.. మూడు ఫార్మాట్లలో (టెస్టులు, వన్డేలు, టీ20లు) అత్యుత్తమ క్రికెటర్‌గా కొనసాగుతున్న విరాట్ మాత్రం రాకెట్ వేగంతో దూసుకొచ్చాడు. తద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక పరుగుల వీరుల జాబితాలో నాలుగో స్థానం సాధించాడు.
Another day at office, another milestone breached!@imVkohli now has 27000 runs in international cricket 👏👏
He is the fourth player and second Indian to achieve this feat!#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/ijXWfi5v7O
— BCCI (@BCCI) September 30, 2024
కోహ్లీ కంటే ముందు ముగ్గురు దిగ్గజాలు 27 వేల క్లబ్లో చేరారు. వీళ్లలో సచిన్ టెండూల్కర్ 34,357 రన్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. కుమార సంగక్కర 28,016 రన్స్, ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్(Ricky Ponting) 27,483 పరుగులతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు.
Another day. Another milestone. One Virat Kohli 👑 pic.twitter.com/9rkKuYk0Y2
— KolkataKnightRiders (@KKRiders) September 30, 2024
పదహారేండ్ల కెరీర్లో చేజ్ మాస్టర్‌గా, రన్ మెషీన్‌గా పేరొందిన కోహ్లీ.. క్రీజులో కుదురుకున్నాడంటే పరగుల వరదే. ఈ కాలపు అత్యుత్తమ ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. అందుకు నిదర్శనంగా పలు రికార్డులు అతడి పాదక్రాంతం అయ్యాయి. టెస్టుల్లో.. 8,871 రన్స్, వన్డేల్లో 13,096 పరుగులు.. టీ20ల్లో 4,188 రన్స్ కొట్టాడు.