IND vs BAN 2nd Test : కాన్పూర్ టెస్టులో గెలుపే లక్ష్యంగా భారత ఆటగాళ్లు వీరకొట్టుడు కొడుతున్నారు. విరాట్ కోహ్లీ(47), కేఎల్ రాహుల్(51)లు ధనాధన్ ఆడడంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నాలుగో రోజు బంగ్లాను 233 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా ఎలాగైనా మ్యాచ్ గెలవాలనే కసితో ఆడుంతోంది. అందులో భాగంగానే ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(72) రోహిత్ శర్మ(23) మెరుపు బ్యాటింగ్‌తో బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు.
యశస్వీ అయితే.. తనదైన దూకుడుతో అర్ధ సెంచరీ బాదేయగా.. శుభ్‌మన్ గిల్(39) సైతం ఉన్నంత సేపు దంచాడు. దాంతో, 10.1 ఓవర్లనే భారత జట్టు 100 రన్స్ కొట్టి చరిత్ర సృష్టించింది. అనంతరం కోహ్లీ, రాహుల్‌లు విధ్వంసాన్ని తారాస్థాయికి చేరింది. ప్రస్తుతం భారత్ 13 పరుగుల ఆధిక్యంలో ఉంది.
🔥 Records aren’t safe when Team India’s on the field!
📷 Getty • #INDvBAN #INDvsBAN #TeamIndia #BharatArmy #COTI🇮🇳 pic.twitter.com/fxgjw9vcLU
— The Bharat Army (@thebharatarmy) September 30, 2024
తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ తడబడినా మొమినుల్ హక్(107), ముష్ఫికర్ రహీం(11)ల అసమాన పోరాటంతో నిలబడింది. రెండు రోజులు ఆట రద్దయ్యాక నాలుగో రోజు 1073తో బ్యాటింగ్‌కు వచ్చిన బంగ్లాకు మొనిల్ హక్ భారీ స్కోర్ అందించాడు. అతడు రెండో సెంచరీతో చెలరేగగా బంగ్లాదేశ్ 233 స్కోర్ చేయగలిగింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు, సిరాజ్, ఆకాశ్ దీప్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు.