Tirumala Laddu | తిరుమలలో లడ్డూ గోదాములను పరిశీలించిన సిట్ బృందం
Tirumala Laddu | తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.
తిరుమల : తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ (Special Investigation Team) దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. మూడో రోజు దర్యాప్తులో భాగంగా తిరుమల (Tirumala) లోని గోదాములు, పరిశోధనశాలలో పర్యటించారు. గోదాములకు(Godowns) వచ్చిన ట్యాంకర్ల నుంచి నెయ్యి నమూనాలు సేకరించారు. ల్యాబ్లో నాణ్యత పరీక్షల యంత్రాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గోదాముల్లో ముడిసరుకుల నాణ్యతను పరిశీలించారు. పిండి మర ప్రయోగశాలను సిట్ సభ్యులు పరిశీలించారు.
శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశంపై లోతైన విచారణ చేస్తామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ( Sarvashresta Tripathi) తెలిపారు . తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్లో నమోదైన కేసు సిట్కు బదిలీ అయ్యిందని వెల్లడించారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామని చెప్పారు.
నివేదిక సమర్పించడానికి ఎలాంటి కాలపరిమితి లేదని అన్నారు. సిట్ బృందంలో డీఐజీ గోపీనాథ్ జెట్టి, ఎస్పీ హర్షవర్దన్ రాజు, అదనపు ఎస్పీ వెంకటరావు నేతృత్వంలో దర్యాప్తును కొనసాగిస్తున్నారు. శనివారం తిరుమలకు చేరుకున్న సిట్ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం లడ్డూలను తయారి చేసే పోటును సందర్శించారు. అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు భేటీ అయి వివరాలు తీసుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

