Prakash Raj | తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు(Chandra Babu) చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు (Supreme Court) తప్పుపట్టింది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా అంటూ నిలదీసింది . కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై రెండో ఒపీనియన్ తీసుకోకుండా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం, ఈ వ్యవహారంలో మీడియాకు వెళ్లాల్సిన అవసరం లేదని అభిప్రాయ పడింది.
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరుగగా.. ఈ విషయంపై ధర్మాసనం మాట్లాడుతూ.. నెయ్యి కల్తీ జరిగినట్టు గుర్తించిన తర్వాత , తయారైన లడ్డూలను టెస్టింగుకు పంపారా, లడ్డూలో కల్తీ జరిగిందని నిర్ధారించారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ నెయ్యితో లడ్డూలు తయారు చేసినట్లు ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇరువాదనలు విన్న కోర్టు కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరం పెట్టాలని సూచించింది.
అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ”దేవుడిని రాజకీయాల్లోకి లాగకండి” అంటూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టాడు. తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య డైలాగ్ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు యాక్టర్లు ఎవరి స్టైల్లో వాళ్లు పంచ్ వేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు.
దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి 🙏🏿🙏🏿🙏🏿
జస్ట్ ఆస్కింగ్. #justasking #justpleading pic.twitter.com/kLjnnJRuun
— Prakash Raj (@prakashraaj) September 30, 2024