నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉమ్మడి జిల్లాలో మొత్తం 37568 మంది జనరల్, వొకేషనల్ విద్యార్థులు పరీక్ష రాయగా, 1,255 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరుగగా, గంట ముందుగానే విద్యార్థులు కేంద్రాలకు చేరుకున్నారు.
వారిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అధికారులు సెంటర్లోకి అనుమతించారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోగా, ఎగ్జామ్ సెంటర్ల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేసి భారీ బందోబస్తు నిర్వహించారు. కాగా, హనుమకొండలో 19,099 మంది, వరంగల్‌లో 6,185, జనగామలో 4,343, మహబూబాబాద్‌లో 4,192, భూపాలపల్లిలో 1,772, ములుగులో 1,977 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, నేటి నుంచి సెకండియర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి