తలమడుగు, ఫిబ్రవరి 25 : ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల డిప్యుటేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బుధవారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో 62 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని, ఇటీవల ఒకరిని డిప్యూటేషన్‌పై మరో పాఠశాలకు సర్దుబాటు చేయడాన్ని నిరసిస్తూ ఉపాధ్యాయులు రాకముందే ఉదయమే పాఠశాల గేటుకు తాళం వేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు నాలుగు గంటలపాటు అక్కడే బైఠాయించారు. సమస్యను పరిష్కరిస్తామని ఎంఈవో వెంకట్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.