ICC Umpire : భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు హడలే. కాలు కదపకుండానే అలవోకగా భారీ సిక్సర్లు కొట్టే హిట్‌మ్యాన్.. ఫుల్‌షాట్ ఆడాడానుకో ఆ బంతి ఇక స్టాండ్స్‌లోకే. ఈ మధ్యే టీమిండియాను పొట్టి ప్రపంచ కప్ చాంపియిన్‌గా నిలిపిన రోహిత్‌పై అంపైర్ అనిల్ చౌదురీ (Anil Chaudhary) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ చాలా తెలివైన క్రికెటర్ అని, అతడికి క్రికెట్ ‘ఐక్యూ’ చాలా ఎక్కువని అనిల్ వెల్లడించాడు.
అంతర్జాతీయ క్రికెట్ మండలి అంపైరింగ్ ప్యానెల్లో ఒకడైమన అనిల్ చౌదరీ తాజాగా పోడ్కాస్ట్లో మాట్లాడాడు. తన అంపైరింగ్ కెరీర్ గురించి.. మైదానంలో తాను చూసిన గొప్ప ఆటగాళ్ల గురించి చెప్పిన ఆయన రోహిత్ శర్మను ఆకాశానికెత్తేశాడు. ‘మనకు మైదానంలో రోహిత్ ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ, అతడు చాలా తెలివైన క్రికెటర్. అవును.. అతడు చాలా స్మార్ట్. అతడి క్రికెట్ ఐక్యూ చాలా ఎక్కువ’ అని అన్నాడు. అంతేకాదు రోహిత్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతడి ఆలోచనా శక్తిని అంచనా వేయడం చాలా కష్టమని అనిల్ తెలిపాడు.
Umpire Anil Chaudhary About Rohit Sharma❤️ pic.twitter.com/z3kZVOuBXN
— Kuljot⁴⁵ (@Ro45Kuljot) August 31, 2024
‘రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే ఒక బౌలర్ గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరినట్టు అనిపిస్తుంది. అతడు కచ్చితత్వంతో షాట్లు ఆడుతాడు. ఏమాత్రం కంగారుపడడు. అందుకని అతడికి అంపైరింగ చేయడం చాలా తేలిక. మరోవిషయం.. రోహిత్ చాలా అప్పీల్స్‌లో భాగమవుతాడు. ‘ఔట్ అని అనుకుంటున్నా’ అని తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు. చూడ్డానికి మనందరికీ హిట్‌మ్యాన్ సరదాగా కనిపిస్తాడు. కానీ, అతడు మనం అనుకునేంత సరదా మనిషి మాత్రం కాదు’ అని అనిల్ వెల్లడించాడు.
Anil Chaudhary said “I was a TV umpire in one match when Rohit Sharma scored 200+, the balls that were Yorkers for others, he was hitting those for sixes – he is in a different class, has lots of ideas, his batting is like music”. [Shubhankar Mishra YT] pic.twitter.com/sm4H08JWRq
— Johns. (@CricCrazyJohns) September 1, 2024
వన్డేల్లో రోహిత్ డబుల్ సెంచరీ కొట్టిన రోజును కూడా ఈ సందర్భంగా అనిల్ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు నేను టీవీ అంపైర్‌గా ఉన్నాను. కోల్‌కతాలో అనుకుంటా అతడు రెండొందలు కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మిగతా భారత ఆటగాళ్లకు యార్కర్లు అనిపిస్తుంటే.. అతడు మాత్రం అలవోకగా సిక్సర్లు బాదేస్తున్నాడు. అతడు నిజంగా ఓ ప్రత్యేక ఆటగాడు. రోహిత్ కొంచెం బద్ధకస్తుడే. కానీ, ఆటపై అతడికి ఉన్న అవగాహన అమోఘం’ అని అనిల్ చెప్పాడు. 2021లో అనిల్ ఆన్ ఫీల్డ్ అంపైరింగ్ కెరీర్ మొదలైంది. ఇప్పటివరకూ ఆయన 4 టెస్టులు, 26 వన్డేలు, 44 టీ20లకు అంపైరింగ్ చేశాడు. ఏ ప్లస్ అంపైర్ అయిన అనిల్‌కు ఐసీసీ ఒక్కో మ్యాచ్‌కు రూ.40 వేలు చెల్లిస్తోంద.