Mercury Transit | జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు తమ రాశులను మార్చుకుంటాయి. డిసెంబర్ 29న బుధుడు తన రాశిని మార్చుకోనున్నాడు. రాత్రి 11.17 గంటలకు గురుగ్రహం రాశి ధనుస్సురాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ సమయంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడితో కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో కలిసి సంచరించడం శుభపద్రంగా ఉంటుంది. ఆర్థిక లాభాలు, ఆత్మవిశ్వాసం, ఉన్నత పదవులు, వ్యాపారంలో ఆశించిన లాభాలు చేకూరుతాయి. ఏడాది చివరలో సూర్యుడు, బుధుడు కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నందున పలురాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానున్నది.
బుధుడి సంచారంతో మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఆర్థిక లాభాలు చూస్తారు. వ్యాపారంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. మీరు పరీక్షలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీరు ఇంటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మీరు పరీక్షల్లో సానుకూల ఫలితాలుంటాయి. బుధుడి ప్రభావంతో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది.
కన్యారాశి వారు డబ్బు సంపాదించేందుకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. మీరు సామర్థ్యాలు కూడా మెరుగవుతాయి. ఈ సమయంలో మీకు ప్రోత్సాహకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతితో పాటు ఆదాయ వనరులు సమకూరుతాయి. సామాజిక సంబంధాలు మునుపటి కంటే బలంగా మారతాయి. వైవాహిక జీవితంలో విభేదాలన్నీ పరిష్కారమవుతాయి. ఇద్దరి మధ్య అవగాహన మెరుగుపడుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలతో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి.
కుంభరాశి వారికి పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త వాహనం, ఇల్లు, భూమిని కొనుగోలు చేయాలని యోచిస్తారు. సృజనాత్మక ఆలోచనలు మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా, ఉన్నతంగా నిలబెడతాయి. వ్యాపారవేత్తలకు కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు మానసికంగా మరింత బలంగా ఉంటారు. ఇది సవాళ్లను ఎదుర్కోవడాన్ని సులభతరం చేస్తుంది. కుటుంబంలోని విభేదాలు, కలహాలు ముగిసిపోతాయి. ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. మీకు అన్ని శుభవార్తలు వినే సూచనలున్నాయి. జీవితంలో అనేకరంగాల్లో పురోగతిని సాధిస్తారు.
Read Also :
Venus Asta | శుక్రుడు అస్తమయం.. ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు దూరం.. వైవాహిక జీవితంలో ఆనందం..!
Rahu-Ketu Transit | కొత్త ఏడాదిలో రాహు-కేతువుల సంచారం.. ఈ రాశులవారికి అన్నీ సమస్యలే..!