Rahu-Mercury Conjunction | కొత్త ఏడాది ప్రారంభంలోనే రాహువు-బుధుల సయోగం జరుగనున్నది. కుంభరాశిలో 18 సంవత్సరాల తర్వాత ఈ సంయోగం జరుగనున్నది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. బుధుడు తెలివితేటలు, వ్యాపారం, వాక్కు, కమ్యూనికేషన్.. మరో వైపు రాహువు జూదం, వృద్ధాప్యం, శ్వాస, వాయువు, విచారం, కఫానికి కారకంగా పేర్కొంటారు. బుధుడు-రాహువు సంయోగంతో పలురాశుల వారికి అదృష్టం వరించనున్నది.
రాహువు-బుధుడు సంయోగంతో మేషరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2026లో ఈ రాశి 11వ ఇంట్లో సంచారం జరుగనున్నది. 11వ ఇల్లు ఆదాయం, లాభాలకు సంబంధించింది. ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో పెట్టుబడుల నుంచి మంచి రాబడి చూడవచ్చు. పూర్వీకుల ఆస్తిలో మీకు గణనీయమైన వాటా దక్కే అవకాశాలున్నాయి. హోదా, ప్రతిష్ట పెరుగుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. దాంతో ఊహించని ఆర్థిక లాభాలుంటాయి. మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.
రాహువు-బుధుల కలయిక వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కలయిక మీ రాశి కర్మ ప్రాంతంలో సంభవిస్తుంది. ఈ సంయోగం కెరీర్, వ్యాపార పురోగతికి చాలా అవకాశాలున్నాయి. కెరీర్, విద్యా రంగాల్లో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతులు, కీలకమైన బాధ్యతలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్న వారికి మంచి ఒప్పందం ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. పెట్టుబడులతో మంచి రాబడులు లభించే సూచనలున్నాయి.
రాహువు-బుధుల కలయికతో మకర రాశివారికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సంయోగం మీ రాశిచక్రంలోని సంపద, వ్యాక్చాతుర్యాన్ని కారకమైన ఇంటిలో ఏర్పడుతుంది. తత్ఫలితంగా మీరు ఆకస్మిక లాభాలను చూసే అవకాశం ఉంది. సంపద కూడబెట్టే ఛాన్స్ కూడా ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక కెరీర్ వృద్ధి, కొత్త అవకాశాలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. పెట్టుబడుల కారణంగా మంచి లాభాలు పొందే సూచనలు గోచరిస్తున్నాయి.
Read Also :
Birth Chart | మీ అప్పుల గురించి మీ బర్త్చార్ట్లను చెప్పేస్తుంది..! గురువు ప్రభావంతోనే ఈ సమస్యలు..!